నిమ్స్ డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్ రాహుల్ దేవరాజ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని సోమవారం సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో నిమ్స్ మరింత ముందంజలో నిలపాలని సూచించారు. వైద్య విద్య, పరిశోధన, సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణలో నిమ్స్ కీలక పాత్ర పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్‌గా సేవలందించిన బీరప్ప కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆయన పదవీకాలంలో నిమ్స్‌లో అవయవ మార్పిడి సేవలు విస్తరించడంతో పాటు అనేక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు బలోపేతం కావడం, వైద్య రంగంలో నిమ్స్ ప్రతిష్ఠ మరింత పెరగడం అభినందనీయమని పేర్కొన్నారు.

By DESK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *