చేర్యాల, జూలై 07 ( సిద్దిపేట న్యూస్): సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్‌ దిలీప్ నాయక్‌ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్‌ కోసం రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. చేర్యా ల మండలం నాగపురి రెవెన్యూ పరిధిలోని కొండపోచమ్మ దేవాలయం వద్ద 30 గుంటల భూమిని కొన్నాళ్ల క్రితం 11 మంది కలిసి కొనుగోలు చేశారు. వారు నాలా కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తహసీల్దార్‌ రూ. 1.10 లక్షల లంచం డిమాండ్‌ చేశారు. ఇందులో 8 దరఖాస్తులు ఆమోదించి, 3 దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. దరఖాస్తుదారులు తహసీల్దార్‌ను సంప్రదించగా, గత నెల 29న కనీసం రూ. 70 వేలు ఇవ్వకుంటే పని జరగదని తేల్చిచెప్పారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం ఉదయం తహసీల్‌ కార్యాలయంలో బాధితులు తహసీల్దార్‌ దిలీ్‌పనాయక్‌కు రూ. 70 వేలు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏబీసీ మెదక్‌ రేంజ్‌ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపారు.

By DESK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *