హుస్నాబాద్ కబడ్డీ అకాడమీ క్రీడాకారుల శిక్షణహుస్నాబాద్ కబడ్డీ అకాడమీ క్రీడాకారుల శిక్షణ

  • మంత్రి పొన్నం ప్రత్యేక చొరవతో కబడ్డీ అకాడమీ ఏర్పాటౌ
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సిద్దిపేట న్యూస్, (హుస్నాబాద్‌): హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.  మంత్రి, హుస్నాబాద్   ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ చొరవతో ఈ అకాడమీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.  దీంతో హుస్నాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లో కబడ్డీ క్రీడలో ప్రతిభా వంతులకు  మెరుగైన శిక్షణ పొందే అవకాశం లభించనుంది.

40 మంది క్రీడాకారులకు అవకాశం

ఈ అకాడమీలో మొత్తం 40 మంది క్రీడాకారులకు అవకాశం కల్పించనున్నారు. వీరిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలు ఉంటారు. ఎంపికైన క్రీడాకారులకు వసతి సదుపాయాలతో పాటు నాణ్యమైన కబడ్డీ శిక్షణ అందించనున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా కోచ్‌లు, వార్డెన్లను నియమించనున్నారు. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బంది నియామకం అకాడమీ నిర్వహణ కోసం కోచ్‌లు, వార్డెన్లతో పాటు గ్రౌండ్స్‌మెన్‌, స్వీపర్‌, భద్రతా సిబ్బంది సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం ఎనిమిది సేవల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నియామకాలను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో చేపట్టనున్నారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ దోహదపడనుంది. హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

By DESK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *